Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంకా నయం.. ఎవరెస్టుపై ర్యాలీ తీయమనలేదు: కోదండరామ్ ఫైర్

నిరుద్యోగుల నిరసన ర్యాలీని రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేస్తున్న ప్రతిపాదనలపై టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం ఘాటుగా స్పందించారు. ‘‘ఇంకా నయం. ఎవరెస్టుపై చేసుకోమనలేదు.

Advertiesment
ఇంకా నయం.. ఎవరెస్టుపై ర్యాలీ తీయమనలేదు: కోదండరామ్ ఫైర్
హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (02:14 IST)
నిరుద్యోగుల నిరసన ర్యాలీని రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేస్తున్న ప్రతిపాదనలపై టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం ఘాటుగా స్పందించారు. ‘‘ఇంకా నయం. ఎవరెస్టుపై చేసుకోమ నలేదు. నిరుద్యోగులు తమ ఆవేదనను ప్రజలకు చెప్పాలని అనుకుం టున్నారు. ప్రజలకు తెలియాలంటే ప్రముఖ ప్రాంతాలను, అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ కూడా అంతే.. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు దాకా ఇప్పటిదాకా ఎన్నో ర్యాలీలు జరిగాయి. అలాగే ఇది కూడా జరుగు తుంది. ఎక్కడో ఊరి బయట చేసుకోమని పోలీసు లంటే ఎలా సమంజసం’’ అని  కోదండరాం ప్రశ్నించారు.
 
పోలీసులు, ప్రభుత్వం రెచ్చగొట్టినా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిరుద్యోగుల నిరసన ర్యాలీని నిర్వహిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ర్యాలీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం ఇప్పటి దాకా అనుమతించకుండా జిల్లాల్లో అరెస్టులకు పాల్పడుతోందన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అవాంతరాలు కల్పించినా కచ్చితంగా ర్యాలీని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అప్రమత్తంగా వ్యవహరించాలని యువతకు కోదండరాం సూచించారు.
 
ఎట్టి పరిస్థితుల్లో రెచ్చిపోవద్దని, తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడినట్టే ఇది కూడా జరగాలన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి, ర్యాలీని శాంతి యుతంగా నిర్వహించే సామర్థ్యం తమకు ఉందన్నారు. ర్యాలీకి ఇప్పటికే 30 విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయని, అనేక యువజన సంఘాలు అండగా ఉంటామని చెప్పినట్టుగా వెల్లడించారు. నిరుద్యోగ యువ కులంతా ర్యాలీలో పాల్గొని, ప్రభుత్వానికి బాధ్యతను గుర్తుచేయాలని పిలుపును ఇచ్చారు. ఫిబ్రవరి 22న డిక్లరేషన్‌ను ప్రకటి స్తామని, దీనికి సంబంధించిన అంశాలపైనా చర్చించామన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎట్టి పరిస్థితుల్లో పన్నీరును వీడే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యేలు