Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ 350 మందికి ఇప్పడామె ఓ దేవత. బాహుబలి టిక్కెట్లు ఇప్పించిది మరి. జయహో ఆమ్రపాలి

బాహుబలి-2 సినిమా కోసం ఒక టికెట్‌కు 3 వేలు పెట్టినా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా దొరకడంలేదు. ఆవిడకు మాత్రం 350 టికెట్లు 24 గంటల ముందే దొరికాయి. వార్తవినగానే ఇంత పక్షపాతమా.. ఆడవారికి మాత్రం ఇలా ఇచ్చేస్తారా అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే మరి. ఎందుక

Advertiesment
Amrapali Kata
హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (02:13 IST)
బాహుబలి-2 సినిమా కోసం ఒక టికెట్‌కు 3 వేలు పెట్టినా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా దొరకడంలేదు. ఆవిడకు మాత్రం 350 టికెట్లు 24 గంటల ముందే దొరికాయి. వార్తవినగానే ఇంత పక్షపాతమా.. ఆడవారికి మాత్రం ఇలా ఇచ్చేస్తారా అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే మరి. ఎందుకంటే రాత్రింబవళ్లు కష్టపడిన శ్రమను గౌరవిస్తూ ఆమె తన కింద పనిచేసే వారికి సినిమా చూసి రండంటూ బాహుబలి-2 టిక్కెట్లు ముందస్తుగా సంపాదించి ఇచ్చింది మరి. ఆమె ఎవరో కాదు. ఆమ్రపాలి. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి. ప్రభుత్వాధికారిణిగా అలా గంపగుత్తగా టిక్కెట్లకోసం ప్రయత్నించవచ్చా లేదా అనేది నైతిక ప్రశ్నే కాని ఆమె చొరవవల్ల 350 మంది సునాయాసంగా రేపు అంటే ఏప్రిల్ 28వ తేదీ ఫస్ట్ షోకు బాహుహలి-2 సినిమా చూసేయనున్నారు.
 
దీనికి కారణం ఉంది కూడా. గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, ఆర్టిస్టులు అంతా కలుపుకొని సుమారు 300 మంది  సుందరీకరణ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. వారికి కాస్త ఆటవిడుపుగా ఉంటుందనే ఉద్దేశంతోనే కలెక్టర్ అమ్రపాలి.. అందరికీ కలిపి బాహుబలి-2 టికెట్లు బుక్ చేయించారు. వరంగల్ ఆర్డీవో ద్వారా బాహుబలి-2 సినిమాటికెట్లు బుక్ చేయించారామె. హన్మకొండలోని ఏసియన్ మాల్‌లో 28న వారంతా ఫస్ట్‌ షో చూడనున్నారు. సమర్థురాలైన అధికారణిగా ప్రశంసలు పొందిన అమ్రపాలి మరోసారి ఇలా వార్తల్లో నిలిచారు.
 
విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ప్రేక్షకులను బాహుబలి ఫీవర్ ఉర్రూతలూగిస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. థియేటర్ల ముందు ప్రేక్షకులు భారీగా బారులు తీరారు. ఈ తరుణంలోనే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా ఒక్కరే 350 టికెట్లు బుక్ చేయించడం చర్చనీయంశమైంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా... మంత్రి కాలవ శ్రీనివాసులు