Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఇంటి వద్ద నుంచే ఓటింగ్

Advertiesment
vote
, సోమవారం, 20 నవంబరు 2023 (13:51 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరుగనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే సౌలభ్యాన్ని కల్పించింది. మొత్తం 12 సంఘాలకు ఈ అవకాశం కల్పించింది. 80 యేళ్లు పైబడినవారు, వికలాంగులు, నడవలేనివారికి ఇంట్లో కూర్చొని ఓటు వేసే అవకాశం కల్పించారు. వృద్దులు, వికలాంగులు ముందుగా ఫారమ్ డి12ను సమర్పించినట్టయిదే బీఎల్వో ఇంటి నుంచి ఓటు వేయమని ఎన్నికల అధికారికి సిఫార్సు చేస్తారు. 
 
కాగా, సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక మంది వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సిబ్బంది వృద్ధుల ఇంటికి వెళ్లి ఓటు వేయిస్తున్నారు. 80 యేళ్లు దాటిన వయో వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. 
 
ఇక సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం, లింగరాజుపల్లిలో 85 యేళఅల పెద్ద రాజయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిన్న ఒక్క రోజులోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా 21 మంది వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, పలు జిల్లాల్లో కూడా వృద్ధులు, వికలాంగులు కూడా తమ ఓటు హక్కును ఇంటి నుంచే వేసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఫామ్ డి12ను సమర్పిస్తున్నారు. 
 
భారత‌లో ముగిసిన వరల్డ్ కప్.. విజేతగా ఆస్ట్రేలియా... ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 
 
స్వదేశంలో దాదాపు నెలన్నర రోజుల పాటు సాగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. భారత్ భంగపాటుకు గురైంది. ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో గెలిచిన కంగారులు విశ్వ కప్‌తో పాటు.. భారీ నగదు బహుమతిని అందుకుంది. 
 
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ‌ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా, ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచ కప్‌ను కంగారులు సొంతం చేసున్నారు. కాగా, ఈ విజయంతో ఆసీస్ జట్టుకు కళ్లు చేదిరే ప్రైజ్ మనీ లభించింది. విజేతగా నిలిచిన కమిన్స్ సేనకు రూ.33.31 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నారు.
 
అలాగే, రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు రూ.16.55 కోట్లు అందజేస్తారు. సెమీ ఫైనల్స్‌లో ఓటమి పాలైన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు  రూ.6.66 కోట్లు చొప్పున ఇవ్వనున్నారు. లీగ్ దశలో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు రూ.83 లక్షలు చొప్పున అందజేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ నౌకను హైజాక్ చేసిన ఇజ్రాయెల్