తెలంగాణలో యథా రాజా... తథా ప్రజా అన్న చందంగా ప్రజాస్వామ్య పరిస్థితి ఉందన్నారు విజయశాంతి. సీఎం కేసీఆర్ అరాచకంగా కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్సీలను టీఆరెస్‌లో కలుపుకుని చేస్తున్న దౌర్జన్యాన్ని ఆదర్శంగా తీసుకుని కొంతమంది దుండగులు ప్రైవేటు ఆసుపత్రిపై దాష్టీకానికి పాల్పడ్డారనీ విమర్శించారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న వారిని అడ్డుకున్న పోలీసులపై ఎంత దురుసుగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డారో యావత్ తెలంగాణ జనం గమనించారా అన్నారు. కొత్తగా ఏర్పడిన టీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి దారుణాలను ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందోనని తెలంగాణ ప్రజానీకం వణికిపోతున్నారు. 
 
									
										
								
																	
	 
	ఉద్యమ సమయంలో కూడా ఎంతో సమయమనంతో వ్యవహరించిన తెలంగాణలో ఇలాంటి అరాచకాలను ఎవరూ సహించరు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేలుకుని, ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.