Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విహెచ్ అనవసరంగా జగ్గారెడ్డిని కెలికారు. బ్రాస్ లెట్ చేజార్చుకున్నారు. రాహుల్ మాటా మజాకా?

నేరకపోయి ఒకటి మాట్లాడితే మరొకటి జరిగిందే అని తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మధనపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డిని రాహుల్ గాంధీ సమక్షంలో తెగ పొగిడిన విహెచ్. తర్వాత వేదికపైనే జరిగిన ట్విస్ట్‌కు బుక్కయిపోయి చివరక

విహెచ్ అనవసరంగా జగ్గారెడ్డిని కెలికారు. బ్రాస్ లెట్ చేజార్చుకున్నారు. రాహుల్ మాటా మజాకా?
హైదరాబాద్ , శనివారం, 3 జూన్ 2017 (03:27 IST)
నేరకపోయి ఒకటి మాట్లాడితే మరొకటి జరిగిందే అని తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మధనపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డిని రాహుల్ గాంధీ సమక్షంలో తెగ పొగిడిన విహెచ్. తర్వాత వేదికపైనే జరిగిన ట్విస్ట్‌కు బుక్కయిపోయి చివరకు ఖరీదైన తన చేతి బ్రేస్ లెట్‌ను  జగ్గారెడ్డికి ఇచ్చేశారు. మొత్తం మీద వీహెచ్ నోటి ధూలే ఆయన బ్రాస్ లెట్‌ను దూరం చేసేసిందని రాజకీయనేతలు, కార్యకర్తలు, ప్రజలు నవ్వుకుంటున్నారు.  
 
సంగారెడ్డి  ప్రజాగర్జన సభకోసం టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి కోట్లు ఖర్చుపెట్టారని, జగమెండితనంతో అధికార పార్టీకి ఎదురునిలిచి తెగించి పనిచేస్తున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎదుట గొప్పలు పోయిన విహెచ్ హనుమంతరావు అక్కడే అడ్డంగా దొరికిపోయారు. జగ్గారెడ్డి అంత ఖర్చుపెడుతుంటే మరి మీరే మిచ్చారు అని రాహుల్ సరదాగా ప్రశ్నిస్తే అబ్బే నా దగ్గరేముంది అంటూ తొట్రుపడ్డారు. 
 
దానికి రాహుల్ అడ్డుపడుతూ మీ చేతిలోని బ్రాస్ లెట్ ఇచ్చేయవచ్చు కదా అని అడిగారు. దానికి విహెచ్ కిందికి వంగి పడి పడీ నవ్వారు. వాస్తవానికి భారీగా ఏర్పాటు చేసిన ఈ సభకు విహెచ్ ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. దాంతో వేదికమీద ఉన్న వారందరూ ఫకాలున నవ్వడంతో వీహెచ్ పరువు పోయినట్లయింది. 
 
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్న మాటకు కట్టుబడి టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డికి బ్రాస్‌ లెట్‌ను అందిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత వి.హను మంతరావు తెలిపారు. ‘ఐతే జగ్గారెడ్డికి ఇచ్చేయ్‌’శీర్షికన మీడియాలో ప్రచురితౖ మెన కథనానికి స్పందించిన ఆయన.. శుక్రవారం ఉదయం సంగారెడ్డికి వచ్చి తన చేతికి ఉన్న బ్రాస్‌లెట్‌ను జగ్గారెడ్డి చేతికి అలంకరించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో రాజీవ్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో పడవలో పర్యటిస్తున్న సమయంలో ఆయన వెంట ఉన్న తనను ‘నా కోసం ఏదైనా చేస్తానని తరచూ చెబుతుంటావని.. ఈ నదిలో దూకుతావా’అని సరదాగా ప్రశ్నించగా నదిలో దూకానని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం బంగారు బ్రాస్‌లెట్‌ను జగ్గారెడ్డికి అందజేస్తున్న విషయం త్యాగం కాదని, మంచి సందేశమన్నారు.  కార్యకర్తలు, నాయకుల డిమాండ్‌ మేరకు రాహుల్‌ను మెదక్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరతామన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాళ్లను అక్కడికక్కడే కాల్చేశారు.. ఆడవాళ్లను సెక్స్ బానిసలుగా మార్చేశారు.