Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లంచం అడిగితేనే కాదు.. ఎన్నికల వాగ్ధానాలు మరిచినోళ్లని కూడా చెప్పుతో కొట్టాలి: వీహెచ్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. లంచం అడిగితే చెప్పుతో కొట్టాలనే కేటీఆర్ వ్యాఖ్యలు ఆహ్వానించదగినట్టివేనంటూ కామెంట్ చేశారు.

లంచం అడిగితేనే కాదు.. ఎన్నికల వాగ్ధానాలు మరిచినోళ్లని కూడా చెప్పుతో కొట్టాలి: వీహెచ్
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (10:28 IST)
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. లంచం అడిగితే చెప్పుతో కొట్టాలనే కేటీఆర్ వ్యాఖ్యలు ఆహ్వానించదగినట్టివేనంటూ కామెంట్ చేశారు. 
 
బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో సీనియర్‌ నేతలు.... జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్ధానాలు మరిచి అబద్ధాలు, మోసం చేసేవారిని కూడా చెప్పుతో కొట్టాలన్నారు. అవినీతి కంటే ఇచ్చిన మాట తప్పడమే పెద్ద మోసమన్నారు. టీఆర్ఎస్.. దళిత సీఎం హామీ ఏమైందని వీహెచ్‌ ప్రశ్నించారు.
 
రెండు పడకగదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని కూడా అదే విధంగా శిక్షించాలన్నారు.మరోవైపు ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం మాటలతో సరిపెడుతోందని, చేతల్లో చూపించాల్సి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిలక్కు చెప్పినట్టు చెప్పా..విన్నావా అనితా.. పగలబడి నవ్వుతున్న రోజా..