Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరు సీఎంల మధ్య లోపాయికారీ ఒప్పందం: బీజేపీ

ఇద్దరు సీఎంల మధ్య లోపాయికారీ ఒప్పందం: బీజేపీ
, బుధవారం, 13 మే 2020 (08:17 IST)
పోతిరెడ్డిపాడుపై ఇద్దరు సీఎంల మధ్య లోపాయికారీ ఒప్పందం ఏముందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ క్వారంటైన్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ఉట్లపల్లిలో ఆయన బత్తాయి తోటలను పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకున్నారు. బత్తాయిలను ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేశారు.

పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్‌ వైఖరి విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్‌, కేసీఆర్‌లు అన్నదమ్ములంటూ ఏపీమంత్రి అనిల్‌ ప్రకటించడం.. ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు వీరిద్దరికీ పరోక్షంగా దగ్గరగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని లక్ష్మణ్‌ అన్నారు.

జీ పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో దీక్ష చేయనున్నట్లు బీజేపీ నేత డీకే అరుణ పేర్కొన్నారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపును ఆపలేని కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన దీక్ష చేపట్టనుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణ కొరియా దుర్ఘటనల్లో ఎంత పరిహారం ఇచ్చారో?: టిడిపి