Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ బిడ్డల కంటే ఆంధ్రా కుక్కలకే విలువెక్కువ : రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేల్చుకున్నారు. ఆయన విమర్శల దాడిని తట్టుకోలేక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే పారిపోతున్నారు. ఈపరిస్థితుల్ల

Advertiesment
తెలంగాణ బిడ్డల కంటే ఆంధ్రా కుక్కలకే విలువెక్కువ : రేవంత్ రెడ్డి
, గురువారం, 4 మే 2017 (15:47 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాటల తూటాలు పేల్చుకున్నారు. ఆయన విమర్శల దాడిని తట్టుకోలేక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే పారిపోతున్నారు. ఈపరిస్థితుల్లో రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ప్రముఖ సినీ హీరో నాగార్జున సతీమణి, పెటా(జంతు సంక్షేమ) కార్యకర్త అమలను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శల దాడి చేశారు. అమలకు జూబ్లీహిల్స్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో పిచ్చికుక్కలను పెంచుకునేందుకు మూడు ఎకరాల స్థలాన్ని తెరాస సర్కారు కేటాయించింది. ఈ చర్యను రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. 
 
హైదరాబాద్‌లో ఆంధ్రా కుక్కలకు ఉన్న విలువ కూడా తెలంగాణ బిడ్డలకు లేదా అని రేవంత్ రెడ్డి .. కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆంధ్రా వ్యక్తులైతేనే తమకు బాగా కమీషన్ ఇస్తారని, అందుకే వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రా వ్యక్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. 
 
తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులకు, యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్.. ఇప్పుడు ఆంధ్రావారికి ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ వాళ్లను అణగదొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన పలు ఉదాహరణలను ఆయన చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ సీఎండీగా ఆంధ్రాకు చెందిన ఎన్వీఎస్ రెడ్డిని మరో ఐదేళ్లపాటు కొనసాగించడం, ఐఐటీఆర్‌కు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సీఈఓగా నియమించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. సీఈఓ పదవికి తెలంగాణలో టాలెంట్ ఉన్న వ్యక్తులే కరువయ్యారా? అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఇద్దరూ నా కోర్కె తీర్చాల్సిందే... తీర్చకపోతే ఏం చేస్తానో తెలుసా...? చిత్తూరులో కామ పోలీస్...