తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి.
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి వుంటుంది. మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.