Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్షా వివరాలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్షా వివరాలు
, మంగళవారం, 1 ఆగస్టు 2023 (22:21 IST)
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షా ఫలితాలు సెప్టెంబర్ 27న వెల్లడి అవుతాయి. టెట్ పరీక్షల కోసం బుధవారం (ఆగస్టు-2) నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. 
 
పేపర్ -1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్ -2తో పాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. 
 
పేపర్ -1- ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు.. (సెప్టెంబర్ 15) జరుగుతుంది. పేపర్ 2.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 600 కోట్ల‌తో విశాఖ‌లో మాల్ ఏర్పాటు.. 8వేల మందికి ఉపాధి అవకాశాలు