Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ... డాక్టరుగా చూడాలనుంది.. : మంత్రి కేటీఆర్

Advertiesment
ktr minister
, ఆదివారం, 4 డిశెంబరు 2022 (15:42 IST)
తనను డాక్టరుగా చూడాలని మా అమ్మ అనుకున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే, తన తండ్రి వద్దని చెప్పడంతో తన ఆలోచన మారిందని ఆయన అన్నారు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఉమెన్ ఇన్ మెడిసిన్ అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
ఆ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. కష్టకాలంలో వైద్యులు పనిచేసే విధానం చూస్తే చాలా గర్వంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో వైద్య వృత్తిపై తన ఆసక్తిని ఆయన వెల్లడించారు. మా అమ్మ తనను డాక్టర్‌గా చూడాలని భావించారన్నారు. ఇందుకోసం ఎంసెట్ రాస్తే 1600 ర్యాంకు వచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు వైద్య సీటు రాలేదన్నారు. కానీ, కర్నాటకలో ప్రవేశ పరీక్ష రాస్తే మెడిసిన్ సీటు వచ్చిందన్నారు. 
 
దీంతో మెడిసిన్ కోర్సులో చేరాలని భావించిన తాను తండ్రి కేసీఆర్ చెప్పిన మాటలతో వెనక్కి తగ్గానని చెప్పారు. "మెడిసిన్‍‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసి జీవితంలో స్థిరపడేందుకు వయస్సు 32 యేళ్లకు చేరుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అర్థరాత్రిళ్ళు కూడా పని చేయాల్సి ఉంటుంది. జీవితం, పనిని సమన్వయం చేసుకోగలవా? అంటూ మా నాన్న చెప్పడంతో నా ఆలోచన మారింది. మెడిసిన్‌‍కు బదులు బయో టెక్నాలజీ వైపు వెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో వైద్యులు రాణిస్తున్నారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ భాషలందు తెలుగు లెస్స : రాష్ట్రపతి ముర్ము