తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంఓ)లో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ పోస్టు చేశారు. నీటి ప్రవాహానికి ఎదురుగా గాల్లోకి అల్లంత ఎత్తున లేచి జంప్ చేస్తున్న చేపల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఈ వీడియోలో వున్న దృశ్యాలు మరెక్కడివో కాదు.. తెలంగాణలోనివే. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పొంగి పొరలుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా పోచారం ప్రాజెక్టులోనూ నీటి ప్రవాహం పొంగుతోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిన నేపథ్యంలో కిందికి నీరు ఎగసిపడుతోంది. ఈ నీటి ప్రవాహంలో కిందకు వెళ్లిపోతున్న చేపలు అలా కిందకు జారిపోతు కూడా గాల్లోకి లేచి మరీ పైకి జంప్ చేస్తున్నాయి.