Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాస ఎంపీ మాలోత్ కవిత ఆర్నెల్ల జైలుశిక్ష

తెరాస ఎంపీ మాలోత్ కవిత ఆర్నెల్ల జైలుశిక్ష
, శనివారం, 24 జులై 2021 (19:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాసకు చెందిన లోక్‌సభ సభ్యురాలు మాలోత్ కవితకు ఆర్నెల్ల జైలుశిక్ష పడింది. ఈమె హబూబాబాద్ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈమెకు ప్రజా ప్రతినిధుల కోర్టులో చుక్కెదురైంది. ఈమెకు కోర్టు 6 నెలల జైలుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 
 
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆమెకు కోర్టు జైలుశిక్ష విధించారు. అయితే, రూ.10 వేల జరిమానా చెల్లించడంతో మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మ‌ళ్ళీ ఐఎఎస్‌ల బ‌దలీలు