Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇవాళ విశాఖ ఉక్కు అన్నారు, రేపు సింగరేణి అంటారు: కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం

ఇవాళ విశాఖ ఉక్కు అన్నారు, రేపు సింగరేణి అంటారు: కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం
, శుక్రవారం, 12 మార్చి 2021 (19:34 IST)
ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తున్నాం అంటున్నారు, ఇలాగే చూస్తూ వూరుకుంటే రేపు సింగరేణిని కూడా ప్రైవేటీకరిస్తాం అంటారు అని కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆయన మాట్లాడుతూ... మన దేశానికి సంబంధించిన సమస్యలపై స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మేము మొదట భారతీయులం, ఆ తరువాత తెలంగాణ బిడ్డలం. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై మా ప్రభుత్వం మాట్లాడకుంటే, భవిష్యత్తులో తెలంగాణ కోసం ఎవరు మాట్లాడతారు," అని మంత్రి కెటి రామారావు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
 
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నందుకు కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం భవిష్యత్తులో సింగరేణిని కూడా ప్రైవేటీకరిస్తుందని ఆరోపించారు. ఎల్‌పిజి ధరల పెంపుపై 2003లో ప్రధానమంత్రి మోడీ, మన్మోహన్ సింగ్‌ను విమర్శించారు. ఇప్పుడు బిజెపికి ఓటు వేస్తే, ఇంధన ధరల పెంపుపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు అంగీకరిస్తున్నారని స్పష్టమవుతుందని ఆయన అన్నారు.
 
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, ఈ ఏడాది జనవరిలో 35,000 మంది ఉద్యోగులను పదోన్నతి కల్పించామని మంత్రి చెప్పారు. న్యాయవాదుల కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. వాట్సాప్ విశ్వవిద్యాలయంలో బిజెపి నాయకులు చదువుకున్నారని ఆయన ఎగతాళి చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన తరువాత ప్రతిపక్షాలు మౌనంగా ఉండిపోయాయని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ను విజయవంతం చేయటం ప్రతి పౌరుడి బాద్యత: ఆంధ్రప్రదేశ్ గవర్నర్