Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రామ సమస్యలపై ప్రశ్న వర్షం : కాలితో తన్నిన తెరాస సర్పంచ్

Advertiesment
Vikarabad
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:34 IST)
తమ గ్రామంలోని సమస్యలై ప్రశ్నించినందుకుగాను ఓ సర్పంచ్ ఆ యువకుడిని కాలితో తన్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి.. గ్రామంలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని.. వెంటనే వాటిని పరిష్కరించాలని సర్పంచ్ సర్పచ్ జైపాల్ రెడ్డిని ప్రశ్నించాడు. 
 
రెండు రోజుల క్రితం జరిగిన ఒక గొడవను దృష్టిలో పెట్టుకున్న సర్పంచ్.. అవన్నీ నీకెందుకురా అంటూ శ్రీనివాస్ మీద దాడి చేసి కాలుతో తన్నడం మొదలుపెట్టాడు. సర్పంచ్ చర్యకు ఖంగుతిన్న శ్రీనివాస్.. గ్రామ సమస్యలు అడిగితే దాడిచేస్తారా అని వాపోయాడు. అనంతరం మార్పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సర్పంచ్ మీద ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపి కేసు నమోదు చేస్తామని ఎస్సై వెంకటశీను తెలిపారు.  
 
మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికార పార్టీకి చెందిన తెరాస సర్పంచ్‌ను సమస్యలపై ప్రశ్నించకూడదా అంటూ నిలదీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు వెళ్ళాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనసరి లేకుంటే అనుమతించరు