Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెవెన్యూ శాఖ కొత్త పేరు భూమాత? కేసీఆర్ ఆ పేరును ఎందుకు పెట్టాలనుకుంటున్నారు?

రెవెన్యూ శాఖ కొత్త పేరు భూమాత? కేసీఆర్ ఆ పేరును ఎందుకు పెట్టాలనుకుంటున్నారు?
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (22:28 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తకొత్త పధకాలు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే ప్రజామోదయోగ్యమైన పధకాలు ప్రవేశపెట్టి ప్రజానేతగా గుర్తింపు పొందారు. ప్రజల్లో ఆదరణ పొందిన ఈ నేత.. ఇప్పుడు ఓ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. భూమికి సంబంధించిన వ్యవహారాలను నిర్వహించే శాఖ రెవిన్యూ శాఖ. రెవిన్యూ శాఖ అంటే అసలు పేరు ఏంటో తెలుసా.. భూమి శిస్తు వంటి వాటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసినశాఖ అని అర్ధం ఉన్నది. అప్పట్లో గ్రామాల్లో శిస్తు వసూళ్లు చేసేవారు.
 
ఇప్పుడు ఆ చట్టం లేదు. రద్దు చేశారు. మరి అలాంటప్పుడు భూమికి సంబంధించిన వ్యవహారాలు చూడటానికి రెవిన్యూ శాఖ ఎందుకు.. దానికోసం ఓ కొత్త శాఖను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దానికి ఓ కొత్త పేరును పెట్టాలని అనుకుంటున్నారు. దానికోసం ఓ కొత్తపేరును నిర్ణయించారు. భూమికి సంబంధించిన కొనుగోలు, అమ్మకం, రిజిస్ట్రేషన్ వంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి.. దానికి తగ్గట్టుగా భూమాత అనే పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
 
అయితే, ఈ నిర్ణయం ఎంతవరకు అమలు చేస్తారు అన్నది చూడాలి. ఒకవేళ దీన్ని కెసిఆర్ అమలు చేస్తే.. ఆయనకు మంచి పేరు రావడం ఖాయంగా కనిపిస్తోంది. భూమాత అనే పేరును కెసిఆర్ ప్రతిపాదిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆమోదం తెలుపుతారు అనడంలో సందేహం అవసరం లేదు. అలానే సిద్ధిపేట లోని కోమటిగడ్డలో కృత్రిమ అడవిని తెరాస ప్రభుత్వం సృష్టించింది.

ఇప్పుడు ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని చూస్తున్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన కృత్రిమ అడవి పెంపకం సక్సెస్ కావడంతో.. భూమాతను తెరపైకి తీసుకొచ్చారు. మరి ఇదిఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దీంతో పాటు ప్రజలకు ఉపయోగపడే అనేక పధకాలను కెసిఆర్ ప్రభుత్వం రూపొందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నామినేటేడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్లాన్... సబితా ఇంద్రారెడ్డికి హోం శాఖా?