Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి పెన్షన్ మంజూరు చేయమంటే కోరిక తీర్చమన్న అధికారి

Advertiesment
Telangana
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (17:02 IST)
రిటైర్డ్ ఉపాధ్యాయుడు అయిన తన తండ్రి మరణానంతరం రావాల్సిన పెన్షన్‌ను మంజూరు చేయాలని కోరిన ఓ యువతిని ట్రెజరీ అధికారి లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. తన సినిమాకు వస్తావా, కోర్కె తీరుస్తావా అంటూ లైంగక వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ టీచరుగా పని చేసి పదవీ విరమణ పొందాడు. ఆ తర్వాత ఆయన భార్య కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వీరి కుమార్తె అనాథగా మారింది. 
 
అయితే, తన తండ్రికి మరణానంతరం రావాల్సిన పింఛను మంజూరు చేయాలని ఆ యువతి స్థానిక ట్రెజరీ కార్యాలయ ఉన్నతాధికారి పవరన్ కుమార్‌ను సంప్రదించింది.
 
కానీ, ఆయన తన కోర్కె తీరుస్తానంటే పెన్షన్ మంజూరు చేస్తానంటూ వేధించసాగాడు. దీంతో ఆయవతి స్థానిక తెరాస నేతల దృష్టికి తీసుకెళ్లింది. వారు మధ్యవర్తిత్వం చేసి అసలు విషయాన్ని బయటకు రానివ్వలేదు. 
 
అయితే, ఆ యువతి చెప్పేవని అబద్దాలేనని ట్రెజరీ అధికారి పవన్ కుమార్ అంటున్నారు. నిబంధనల ప్రకారం ఆ యువతి పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైందని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెడ్డి గ్యాంగ్ స‌భ్యులు వీరే! కదలికలపై పోలీసు నిఘా!!