Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో నేటితో ఇంటర్ పరీక్షలు పరిసమాప్తం

Advertiesment
తెలంగాణాలో నేటితో ఇంటర్ పరీక్షలు పరిసమాప్తం
, మంగళవారం, 24 మే 2022 (08:27 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
ఈ పరీక్షలకు మొదటి, రెండు సంవత్సరాల్లో కలిసి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, వచ్చే నెల 20వ తేదీ నాటికి ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, సోమవారం నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇరాన్‌లో కూలిన పదంతస్తుల భవనం : ఐదుగురు దుర్మరణం