Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెహర్బాని కోసం సర్కారుకు తొత్తులుగా మారిన ఖాకీలు : బండి సంజయ్

మెహర్బాని కోసం సర్కారుకు తొత్తులుగా మారిన ఖాకీలు : బండి సంజయ్
, బుధవారం, 23 డిశెంబరు 2020 (20:58 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ప్రభుత్వ తొత్తులుగా అభివర్ణించారు. ప్రమోషన్ల కోసం, మెహర్బానీ కోసం కొంతమంది పోలీసులు ప్రభుత్వ తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు లేకపోలేదు.
 
నిజానికి తెలంగాణలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే సాగుతోంది. గోవుల అక్రమ రవాణా అంశంపై మొదలైన వివాదం.. బీజేపీ నేతలు వర్సెస్ పోలీసుల వ్యవహారంగా మారింది. 
 
ఈ వివాదంపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో గోవధపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ల కోసం కొంత మంది పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న ఆయన.. ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులకు మాత్రమే వ్యతిరేకం అని స్పష్టం చేశారు. గోవధపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
గోవులు హిందువుల ఆరాధ్య దైవం అని, గోవులను వధిస్తే చూస్తూ ఊరుకోబోమని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులు చేయలేని పనిని రాజాసింగ్ చేసి చూపిస్తున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు.  
 
కాగా, గోవధపై ఫిర్యాదు చేసినందుకు బీజేపీ అనుబంధ విభాగాలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. యజ్ఞ యాగాలు చేసే సీఎం కేసీఆర్.. గోవధపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 
 
కిందస్థాయిలో జరుగుతోన్న విషయాలను పోలీస్ అధికారులు తెలుసుకోవాలని ఎంపీ సూచించారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా బండి సంజయ్ స్పందించారు. జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్‌ను ఏర్పాటు చేసే బలం తమకు లేదని, గ్రేటర్ లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2021 అవుట్‌లుక్: భారతదేశం, ప్రపంచానికి ఎలా వుండబోతోంది?