తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం ఒకటి లీకైంది. ఈ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారంటా అభియోగాలు మోపిన పోలీసులు.. ఆయన్ను బుధవారం అర్థరాత్రి అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు కోర్టులో హాజరుపరచగా, ఆయనకు ఈ నెల 19వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది.
ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం హన్మకొండ నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో దాదాపు ఎనిమిది గంటల పాటు వాదనలు జరిగాయి. ఆ తర్వా రాత్రి 10 గంటలకు న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని, ఆధారాలను ధ్వంసం చేయొద్దని ఆదేశించారు. బండి సంజయ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు.
మరోపైవు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ-2గా ఉన్న బూర ప్రశాంత్, ఏ-3గా ఉన్న గుండబోయిన మహేశ్‌లను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై విచారణనుు న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు.