Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిప్పు లేకుండా తగలబడుతున్న ఇళ్లు... వణికిపోతున్న ప్రజలు.. ఎక్కడ?

నిప్పు లేకుండా తగలబడుతున్న ఇళ్లు... వణికిపోతున్న ప్రజలు.. ఎక్కడ?
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (19:58 IST)
నిప్పు లేకుండా ఇళ్లు తగలబడుతున్నాయి. దీంతో ఆ గ్రామస్తులు వణికిపోతున్నారు. నల్లగొండ జిల్లాలోని ఓ తండాలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇలా అంతుచిక్కని అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్న తండావాసులు మంత్రగాళ్లను ఆశ్రయించారు. దుష్టశక్తుల గండం నుంచి బయటపడాలంటే మంత్రులకు రెండు లక్షల రూపాయలు సమర్పించుకుని చేయించారు. 
 
మూడు మూగ జీవాలను బలి ఇచ్చినా అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. తండాలో ఏదో చోట నిప్పు రవ్వలు అంటుకుని మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రగాళ్ల పూజలు తండా వాసుల భయాన్ని పోగొట్టే లేకపోయాయి. నిత్యం వ్యవసాయ పనులకు వెళ్లకుండా తండాలో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆరాధ్య దైవమైన ఆంజనేయస్వామికి తండావాసులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 
 
ఇదివుంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం పాత ఊరి తండా గ్రామంలో కొద్దిరోజులుగా ఓ వింత జరుగుతోందీ అంటున్నారు స్థానికులు. ఊళ్లో ఎక్కడోచోట, ఏదో మూల, ఏదో ఒక ఇంట్లో, ఏదో ఒకటి తగలబడుతోంది. ఒకరోజు పొలంలో గడ్డివాము తగలబడితే, ఇంకోరోజు ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టం అంటుకుంటోంది. ఏమైందా అని ఆరా తీసే లోపే.. ఈసారి నట్టింట్లో మంటలు రాజుకుంటుంటున్నాయి. ఇంట్లో ఉన్న బట్టలు, దుప్పట్లు, మంచాలు కాలిపోతున్నాయి.
 
వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఈ విచిత్రమే గ్రామస్థులను భయపెడుతోంది. ఒకసారి రెండుసార్లు జరిగితే ప్రమాదం అనుకున్నారు. గడ్డివాములు లాంటివి తగలబడితే ఎండకో, ఏ బీడీ నిప్పుకో అంటుకుని ఉంటుందని భావించారు. కానీ, ఇళ్లలో బట్టలు ఎలా తగలబడతాయి. గూట్లో పెట్టిన పుస్తకాలకూ మంటలు ఎలా? సరే, అదీ ఏదో ప్రమాదం అనుకుందాం..కానీ, తాళాలు వేసి ఉన్న ఇంట్లో నుంచి కూడా పొగలు వస్తుంటే గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతలుకు గురవుతున్నాయి. అసలేలా మంటలు అంటుకుంటున్నాయో తెలియక ఉపిరి బిగపట్టుకుని కాలంవెళ్లదీస్తున్నారు తండావాసులు.
 
రాత్రి పూట జరిగితే.. ఎవరో కావాలనే చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ.. పట్టపగలే జరుగుతోంది. ప్రత్యేకించి మధ్యాహ్నం 12 గంటల నుంచి 4గంటల మధ్యే ఈ నిప్పు, పొగ కనిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎప్పుడు ఏం అంటుకుంటుందో తెలీక గ్రామస్తులు పొలం పనులు కూడా మానేసి ఇంట్లోనే కూర్చుంటున్నారు. అయినా మంటలు ఆగలడంలేదట. 22 రోజుల నుంచీ చోటుచేసుకున్న ఈ ఘటనలతో ఆ గ్రామస్తులు వణికిపోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యం, వెల్‌నెస్‌ ప్రయోజనాలతో సూర్యోదయ్‌ బ్యాంక్‌ ప్రీమియం సేవింగ్స్‌ ఖాతాలు