Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చందా నగర్‌లో టెక్కీపై దాడి.. చేతులు కట్టేసి... నోట్లో గుడ్డలు కుక్కి చితకబాదారు

Advertiesment
చందా నగర్‌లో టెక్కీపై దాడి.. చేతులు కట్టేసి... నోట్లో గుడ్డలు కుక్కి చితకబాదారు
, శనివారం, 31 జులై 2021 (08:39 IST)
హైదరాబాద్ శివారులోని చందానగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌పై కొందరు వ్యక్తులు పాశవికంగా దాడి చేశారు. రెండు చేతులను తీగలతో కట్టేసి, కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి చిత్ర హింసలకు గురించి, చితకబాదారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక హుడా కాలనీ సమీపంలోని ఇంజినీర్స్ ఎన్‌క్లేవ్‌లో మామిళ్లపల్లి శ్రీహర్ష (28) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తన స్నేహితుడు సాయిరాం ప్రసాద్‌తో కలిసి వుంటున్నాడు. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో స్నేహితుడు బయటకు వెళ్లగా శ్రీహర్ష ఒక్కడే ఉన్నాడు.
 
ఆ సమయంలో ఇద్దరు ఆగంతుకులు లోపలికి వచ్చి ‘‘ఎత్తుగా ఉన్న వ్యక్తి లేడా?’’ అని ప్రశ్నించారు. బిజినెస్ గురించి మాట్లాడాల్సి ఉందని చెప్పడంతో వస్తాడు కూర్చోమని శ్రీహర్ష చెప్పాడు. అనంతరం వారు మంచినీళ్లు అడగడంతో తీసుకొచ్చేందుకు కిచెన్‌లోకి వెళ్తుండగా వెనుక నుంచి వెళ్లి శ్రీహర్షపై దాడిచేశారు. తలను గోడకేసి కొట్టడంతో కూలబడిపోయాడు.
 
ఆ వెంటనే అతడి చేతుల్ని తీగలతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మరోమారు దాడిచేశారు. మా అన్న జోలికి వస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని, చస్తావని వదిలేస్తున్నామని హెచ్చరించి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ఓ ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లు, ఒక ఏటీయం కార్డుతోపాటు రూ.3,500 నగదును దోచుకుని పారిపోయారు. 
 
ఆ తర్వాత రూముకు వచ్చిన సాయిరాం స్నేహితుడి కట్లు విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 15న స్థానికంగా నివసించే ఓ వ్యక్తి మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి కారులో వచ్చి శ్రీహర్ష, సాయిరాంలను దూషించడమే కాకుండా దాడి చేసి కొట్టాడు.
 
దీంతో బాధితులు అదే రోజు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనకు అదే కారణమై ఉంటుందని భావిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఇలాంటి దాడి సంఘటనలు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అధికమైపోతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవినేని అక్క జైలుకెళా వెళ్ళాడో చూశాం కదా, రోజా వ్యంగాస్త్రాలు