శిరీషది ఆత్మహత్యే మా వద్ద ఆధారాలున్నాయ్.. శ్రవణ్‌కు ఏ పాపం తెలీదు..
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకుందనేందుకు తమ వద్ద తగిన ఆధారాలున్నాయని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. కానీ శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా అనేది మాత్రం ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు.

శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమెను చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. శిరీషది ఆత్మహత్యేనని.. అనుమానాలుంటే తీరుస్తామని వెంకటేశ్వర రావు చెప్పారు. కుకునూర్ పల్లి ఎస్సై క్వార్టర్స్‌లోనే ఈ వ్యవహారం జరిగిందని... ఫామ్ హౌస్‌లో కాదని.. అదంతా అసత్యపు ప్రచారం అన్నారు.
మరోవైపు శిరీష కేసులో నిందితుడైన శ్రవణ్‌కు ఏ పాపం తెలియదని ఆతని కుటుంబీకులు, తల్లిదండ్రులు అంటున్నారు. శ్రవణ్‌కు రియల్ ఎస్టేట్ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని.. శిరీష ఆత్మహత్యకు శ్రవణ్‌కు కూడా సంబంధం లేదన్నారు. కావాలనే శ్రవణ్‌ను ఇరికించారని ఆతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమది మధ్య తరగతి కుటుంబమని చెప్పుకొచ్చారు. మీడియాలో శ్రవణ్ గురించి వస్తున్న వార్తలన్నీ అసత్యమని, మా అబ్బాయి చాలా మంచోడని వారు చెప్తున్నారు.