Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసలే కోతి.. ఆపై కల్లు తాగిండు.. ఆపై పోలీసయ్యిండు.. లైవ్‌లో టార్చర్ చూపిండు

అప్పు ఇచ్చిన పాపానికి, అప్పు తిరిగి ఇవ్వమన్న పాపానికి, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి మారుపేరని ఘనంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లో ఖాకీ డ్రెస్ వేసిన ఒక కిరాతక పోలీస్ ఎస్సై అప్పుఇచ్చినవారికి భూమ్మీదే నరకం చూపించాడు. పోలీసులందు రాక్షసులు వేరయా అనే చందంగా మనిషి

అసలే కోతి.. ఆపై కల్లు తాగిండు.. ఆపై పోలీసయ్యిండు.. లైవ్‌లో టార్చర్ చూపిండు
హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (06:04 IST)
అప్పు ఇచ్చిన పాపానికి, అప్పు తిరిగి ఇవ్వమన్న పాపానికి, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి మారుపేరని ఘనంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లో ఖాకీ డ్రెస్ వేసిన ఒక కిరాతక పోలీస్ ఎస్సై  అప్పుఇచ్చినవారికి భూమ్మీదే నరకం చూపించాడు. పోలీసులందు రాక్షసులు వేరయా అనే చందంగా మనిషిగా కాకుండా మదగొడ్డులా వ్యవహరించిన మనిషి రూపంలోని మృగం నోటికొచ్చిన బూతులు తిడుతూ ‘థర్డ్‌’డిగ్రీ ఇంటరాగేషన్‌ చేశాడు. అసలు అంత అప్పు ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ చావబాదాడు..అంతేకాదు వారి అరుపులు, ఆర్తనాదాలను ఫోన్‌లో అవతలి పార్టీకి లైవ్‌లో వినిపించాడు. ‘చాలా.. హ్యాపీయా’అంటూ సిబ్బందితోనూ కొట్టించాడు. ఇంతకూ మనిషిరూపంలోని ఈ మృగం పేరు ఎస్సై కోటేశ్వరరావు. అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆ పోలీసు స్టేషన్ పేట్ బషీరాబాద్ స్టేషన్.
 
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ శాతవాహన నగర్‌ వాసి శివ ప్రదీప్‌కు స్నేహితుడి ద్వారా పరిచయమైన రవీంద్ర ప్రసాద్‌కు వ్యాపారంకోసమని గత రెండేళ్లుగా విడతలు విడతలుగా 75 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. వాయిదాలు వేస్తూ డబ్బులు తిరిగి చెల్లించకుండా ఎగ్గొడుతూవచ్చిన రవీంద్రప్రసాద్ మార్చి 31న శివప్రదీప్‌కు ఫోన్‌ చేసి.. రూ.పది లక్షలు ఇస్తానని, పేట్‌ బషీరాబాద్‌లోని బాలాజీ ఆస్పత్రికి రమ్మని పిలిచాడు. అది నమ్మి శివప్రదీప్‌ అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఎస్సై కోటేశ్వరరావు శివప్రదీప్‌ను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు.
 
అప్పటినుంచి లాకప్‌లో బంధించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడు. ఠాణాలోని సిబ్బందితో కొట్టించాడు. ఈ సమయంలో బాధితుడి కేకలు, అరుపులు, కొడుతున్న చప్పుళ్లను.. ఫోన్‌లో ప్రత్యర్థి రవీంద్ర ప్రసాద్‌ స్నేహితుడు అనిల్‌కు వినిపించాడు. ‘ఇక చాలా.. హ్యాపీయా..’అంటూ మరింతగా రెచ్చిపోయాడు. ఇలా ఎస్సై కోటేశ్వరరావు కొందరిని చిత్ర హింసలకు గురి చేస్తూ ప్రత్యర్థులకు ఫోన్‌ చేసి మరీ వినిపించిన ఆడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
అప్పు ఇచ్చానని చెబుతున్న శివప్రదీప్‌.. ఆ అప్పు వసూలు చేసుకోవడానికి అంతకుముందు కొందరి ద్వారా ప్రయత్నించాడు. దీంతో అప్పు తీసుకున్న రవీంద్ర ప్రసాద్, అతడి స్నేహితుడు అనిల్‌లు ఎస్సై కోటేశ్వరరావును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శివప్రదీప్‌ను, మరికొందరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదారు. వారిని కొడుతున్న తీరును ఫోన్‌ చేసి మరీ ప్రత్యర్థికి వినిపించడం, ఆడియో రికార్డు చేసుకొమ్మని చెప్పడం ఎస్సై దాష్టీకాన్ని స్పష్టంగా చూపుతోంది. 
 
అనిల్‌ చేసిన ఫోన్‌కాల్‌ రికార్డు మెల్లగా ఇతర స్నేహితుల ద్వారా సోషల్‌ మీడియాలోకి చేరి చక్కర్లు కొడుతోంది. ‘అప్పు ఇచ్చేందుకు నీకు అన్ని డబ్బులు ఎక్కడివి’అని శివప్రదీప్‌ను కొడుతూ మొదలైన సంభాషణ.. బాధితుడిని కొడుతున్న చప్పుళ్లు.. అరుపులు.. ఎస్సై బూతులు.. ‘నువ్వు శాటిస్‌ఫై అయ్యావు కదా..’అని ప్రత్యర్థి అనిల్‌ను అడగడం.. అతను నవ్వుతూ ‘వారిని వదలొద్దంటూ’సలహాలివ్వడం దాకా ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.
 
బాధితుడు శివప్రదీప్‌ తనను పోలీసులు ఇబ్బందులకు గురిచేసిన ఘటనపై సైబరా బాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం బయటకు వచ్చింది. దీంతో సొంత పీఎస్‌లోనే ఎస్సైపై కేసు నమోదైంది. అధికారాన్ని వక్రమార్గంలో వినియోగించి బాధితుడినే చిత్రహింసలు పెట్టిన ఎస్సైకోటేశ్వరరావు తన సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి పరారయ్యాడు. వీడిపై ఐపీసీ 385, 342, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యా యి. ఈ ఘటనలో ఎస్సైతో పాటు నలుగురు సిబ్బందికి ప్రమేయమున్నట్లు తెలిసింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మండిపడ్డ ఇవాంకా... రెచ్చిపోయిన ట్రంప్... ధ్వంసమైన స్థావరం!