హైదారాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన దారుణంపై దేశమంతా ఊగిపోతుంది. ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజును ఉరితీయాలంటూ దేశ ప్రజలు భావిస్తున్నారు. ఐతే పరారీలో నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
70బృందాలుగా విడిపోయి వెయ్యి మంది పోలీసులు నిందితుడు రాజును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ లోని ప్రతీ గల్లీలో గాలింపు చర్యలు చేపట్టారు. కూలీల అడ్డా వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు.
ప్రతీ వైన్ షాపుకు నిందితుడు రాజు ఫోటో, వివరాలను పంపించారు. 100మందికి పైగా వ్యభిచారులను పోలీసులు ప్రశ్నించారు. ఇతర జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్ళే బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సు డ్రైవర్లను, కండక్టర్లకు సూచనలు జారీ చేసారు. అనేక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.