Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు భాష ఎంతో మధురమైనది... సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరిస్తాం: కేసీఆర్

తెలుగు భాష ఎంతో మధురమైనదని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అక్కినేని నాగేశ్వర్‌రావు జాతీయ పురస్కారం-2017 ప్రదానోత్సవాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని

తెలుగు భాష ఎంతో మధురమైనది... సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరిస్తాం: కేసీఆర్
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (06:37 IST)
తెలుగు భాష ఎంతో మధురమైనదని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అక్కినేని నాగేశ్వర్‌రావు జాతీయ పురస్కారం-2017 ప్రదానోత్సవాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నాగేశ్వరరావు సినిమాల్లోని పాటలన్నీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నాటి పాటలు గొప్పగా ఉండేవని ఇదే వేదికపై కూర్చొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలుగు భాష ఎంతో మధురమైందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. 
 
అందుకే ప్రతి చిత్రంలోనూ పాతతరంలాంటి మంచి పాటలు ఒక్కటైనా ఉపయోగించాలని కోరారు. గత ఏడాది ఏఎన్నార్ అవార్డును స్వీకరించడానికి వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌బచ్చన్ నాతో మాట అన్నారనీ, అత్యధిక చిత్రాలు హైదరాబాద్‌లో నిర్మితమవుతున్నాయని, హైదరాబాద్‌కు ఆ స్థాయి ఉందని, దానిని మీరు ప్రోత్సహిస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
 
ఈ రోజు సినిమా అంటే వెండితెర మాత్రమే కాదు బుల్లితెర వచ్చాక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దానిని బాగుచేయాలని అమితాబ్ అన్నారు అని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తప్పకుండా తెలుగు సినీ పరిశ్రమకు అన్నివిధాల సహకారాన్ని, తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. ఒక మహానటుడి పేరుపై ఉన్న ఈ అవార్డును స్వీకరించేందుకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రాజమౌళి అన్ని విధాలా అర్హులని చెప్పారు. సాహసాలు చాలామంది చేస్తారు కానీ ప్రతీది విజయవంతం కాదని, అయితే తాను విన్నంతవరకు రాజమౌళి చేసిన సాహసాలన్నీ ఫలించాయని తెలిపారు. బాహుబలి సినిమాను తొలుత హిందీలో చూసే అవకాశం వచ్చిందని, తెలుగువాడిగా మళ్లీ తెలుగులో సినిమా చూశానని, అది అద్భుతమైన కళాఖండమని సీఎం కేసీఆర్ కొనియాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాట్సాఫ్ కేసీఆర్... మీ నిర్ణయం చాలా గొప్పది : ఉపరాష్ట్రపతి వెంకయ్య