Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బర్త్ డే పార్టీకి రమ్మని తోడల్లుడి భార్యపై అత్యాచారం, ఆ విషయం భార్య చెప్పలేదు కానీ...

Advertiesment
బర్త్ డే పార్టీకి రమ్మని తోడల్లుడి భార్యపై అత్యాచారం, ఆ విషయం భార్య చెప్పలేదు కానీ...
, బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (11:41 IST)
ఇద్దరికి పెళ్ళిళ్లు అయ్యాయి. బాగా సాగిపోతున్న కుటుంబం. కానీ వారి మధ్య అక్రమ సంబంధం చివరకు వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. పెళ్ళయి పిల్లలు ఉన్నా వారు మాత్రం శృంగారాన్ని కోరుకున్నారు. చివరకు ఉమ్మడి కుటుంబం కాస్త చిన్నాభిన్నంగా మారి పిల్లలు అనాధలుగా మారిపోయారు.
 
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఏలూరుపేటకి చెందిన సాయి, అతని భార్య లక్ష్మితో కలిసి ఆరేపల్లిలోని తోడల్లుడు అంజయ్య ఇంటికి వెళ్ళారు. అంజయ్య కూతురు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఎప్పటి నుంచో లక్ష్మిపై కన్నేసిన అంజయ్య అదేరోజు రాత్రి ఆమెను లొంగదీసుకునే ప్లాన్ వేసాడు.
 
ఇందులో భాగంగా పూటుగా మద్యం సేవించాడు. మద్యం సేవించి చేస్తే.. ఏదో తాగుబోతు కదా మత్తులో చేసేశాడని జనం అనుకుంటారని తన పథకం అమలుచేసాడు. రాత్రి లక్ష్మి ఒంటరిగా వున్న సమయంలో ఆమె వద్దని వారించినా అంజయ్య ఆమెపై అఘాయిత్యం చేసాడు. బంధువు కావడంతో కేకలు వేస్తే ఎక్కడ పరువు పోతుందోనని ఆమె సైలెంట్‌ అయిపోయింది. కానీ లక్ష్మి భర్త మాత్రం తన భార్య అంజయ్య మంచం పైనుంచి లేచి రావడాన్ని కళ్లారా చూశాడు. విషయాన్ని అంజయ్య భార్య, తల్లికి చెప్పాడు. వేడుకల తరువాత భార్యను నిలదీశాడు. 
 
ఏమీ లేదని సర్ది చెప్పేందుకు యత్నించింది లక్ష్మి. కానీ ఆ తరువాత మరో రోజు కూడా అంజయ్య తన భార్య పట్ల చనువుగా ప్రవర్తించడం, సైగలు చేయడాన్ని చూసాడు సాయి. ఇక ఎలాగైనా అంజయ్యను చంపేయాలనుకున్నాడు. తన స్నేహితుడు నాగరాజు సహాయంతో ఒక ప్లాన్ చేశాడు. అది కూడా మద్యం తాగించి చంపేయాలనుకున్నాడు.
 
ఏమీ తెలియనట్లు కూతురు బర్త్ డే పార్టీకి రమ్మన్నాడు. నమ్మి వెళ్ళాడు అంజయ్య. తన స్నేహితుడిని వెంట పెట్టుకుని వెళ్ళిన సాయి, అంజయ్యకు పూటుగా మద్యం పోశాడు. స్పృహ లేని అంజయ్యను బండిపై నాగరాజు, సాయిలు తీసుకొస్తూ ఊరికి చివరన బండి ఆపారు.
 
ఎవరూ లేని చోట అంజయ్యను దింపి రోడ్డు పక్కనే వున్న బండరాయి తీసుకుని అతడ తలపై గట్టిగా మోది చంపేశారు. ఆ తర్వాత అతడి శవాన్ని రోడ్డుకి కాస్త పక్కనే పడవేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28న పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన.. రాష్ట్రపతి పాలన ఖాయమా?