Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసిన సహ విద్యార్థులు

Advertiesment
rape iflu girl student osmania university osmania university
, సోమవారం, 3 నవంబరు 2014 (18:04 IST)
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ఒక విద్యార్థిని మీద అత్యాచారం జరిగిందన్న సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఉస్మానియా యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ ఇఫ్లూ యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని తనపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇఫ్లూ విద్యార్థినినైన తనను తనతో చదివే విద్యార్థులే అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
 
నాలుగు నెలల క్రితం ఇదే వర్సిటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి తన సహ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన సంఘటన మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది. 24 గంటల తర్వాత ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Share this Story:

Follow Webdunia telugu