Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధికారంలోకి వస్తే అదానీకి చుక్కలు చూపిస్తాం.. రాహుల్ గాంధీ

rahul gandhi
, బుధవారం, 18 అక్టోబరు 2023 (18:21 IST)
ములుగులో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ యాత్ర సాగుతోంది. ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌‌పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 
 
బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్‌‌ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని చెప్పారు. ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. 
 
ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని రాహుల్ అన్నారు. అదానీ ఓవర్ ఇన్వాయిస్‌డ్ బొగ్గు దిగుమతుల వల్ల రూ.12,000 కోట్ల మేరకు ప్రజల జేబులు గుల్లయ్యాయని, అదానీకి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తోంది. 
 
ఆయన వెనుక ఏ శక్తి ఉందో అందరికీ తెలుసునని రాహుల్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అదానీ గ్రూప్‌పై దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ : కేంద్రం వెల్లడి