రోహిత్ వేముల దళితుడే కాదు.. ఆ నివేదిక గోప్యంగా ఉంచారు.. ఎందుకు?
రోహిత్ వేముల ఉదంతం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల దళితుడు కానే కాదని మానవ వనరుల శాఖ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రోహిత్
రోహిత్ వేముల ఉదంతం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల దళితుడు కానే కాదని మానవ వనరుల శాఖ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రోహిత్ దళితుడని కొందరు, అతడు బీసీ అని కొందరు వాదించిన నేపథ్యంలో.. రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఏర్పాటైన విచారణ కమిటీ విచారణను పూర్తి చేసింది.
అంతేగాకుండా సదరు శాఖకు సైతం నివేదికను అందించింది. జనవరిలో వేసిన ఈ కమిటీ దాదాపు ఏడు నెలల పాటు ఈ కేసుపై అధ్యయనం చేసి తుది నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. రోహిత్ వేముల దళితుడే కాదని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ కమిటీలో కీలక అధికారిగా వ్యవహరించిన అలహాబాద్ హైకోర్ట్ జడ్జి కె.రూపన్‌వాల్ ఈ విషయాన్ని నివేదికలో పొందుపరిచారు.
అయితే ఈ నివేదిక మీడియా చేతికి దొరకకుండా గోప్యంగా ఉంచారు. రోహిత్ వేముల దళితుడు కాదని వస్తున్న వార్తలపై సోదరుడు స్పందించాడు. ఈ వార్తలను కొట్టి పారేశాడు. తాము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దళితల్లాగానే బతికామన్నాడు. ప్రస్తుతం కూడా అలాగే జీవిస్తున్నామన్నాడు. విచారణ కమిటీ నివేదిక కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆరోపించారు.