Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదుకి ప్రధాని మోదీ: స్వాగతించేందుకు వెళ్లని సీఎం కేసీఆర్

Advertiesment
హైదరాబాదుకి ప్రధాని మోదీ: స్వాగతించేందుకు వెళ్లని సీఎం కేసీఆర్
, శనివారం, 5 ఫిబ్రవరి 2022 (17:15 IST)
నెలరోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకలేదు. ఈసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రధానికి స్వాగతం పలకకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాటవేశారు. 
ప్రధాని రాకకు కొద్ది రోజుల ముందు, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీని... ఎన్నికల కోసం వేషం అంటూ విమర్శించారు.

 
అంతేకాదు... బడ్జెట్ పైన కూడా ప్రధానమంత్రిని తూర్పారబట్టారు. మరోవైపు ప్రధానమంత్రి ఎయిర్‌పోర్ట్ వెల్‌కమ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడాన్ని తెలంగాణ బీజేపీ "ఇడియటిక్ మరియు సిగ్గుచేటు" అని అభివర్ణించింది. కేసీఆర్ నిత్యం రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది.
 
 
11వ శతాబ్దపు భక్తి సన్యాసి శ్రీ రామానుజాచార్య స్మారకార్థం, అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించేందుకు, 'సమానత్వ విగ్రహాన్ని' జాతికి అంకితం చేసేందుకు ప్రధాన మంత్రి రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు.

 
 విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. కాగా సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారనీ, రామానుజ విగ్రహావిష్కరణలో పాల్గొంటారని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్ మీద దేశద్రోహం కేసు పెట్టాలి.. రేవంత్ రెడ్డి