Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు భాగ్యనగరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

Advertiesment
Draupadi Murmu
, మంగళవారం, 4 జులై 2023 (08:32 IST)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగే అల్లూరి 125వ జయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరవుతున్నారు. గచ్చిబౌలిలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకోనున్నారు.
 
అనంతరం రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పర్యాటకుల సందర్శన తీరును సమీక్షించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి రాష్ట్రపతి చేరుకుంటారు. ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని, అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ.. ఎప్పుడు..? టీడీపీకి-జనసేనకు షాక్!