Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్వరలో పందుల పెంపకంపై పాలసీ : తలసాని

Advertiesment
త్వరలో పందుల పెంపకంపై పాలసీ : తలసాని
, మంగళవారం, 17 డిశెంబరు 2019 (08:02 IST)
త్వరలో పందుల పెంపకంపై మెరుగైన పాలసీ రూపొందిస్తామని పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఇవాళ పిగ్‌ బ్రీడింగ్‌ పాలసీ పై పందుల పెంపకం దారుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఈ వృత్తిపట్ల ఆసక్తి కనబరిచే వారికి ప్రభుత్వం అన్ని విధానాల చూయూతనిస్తుందన్నారు. రాష్ట్రంలో వేలాది కుటుంబాలు పందుల పెంపకం పై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ వృత్తిని పట్టించుకోలేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ వృత్తిపై ఆధారపడిన వారికి అవసరమైన సహకారం అందిస్తుందన్నారు.

పందుల పెంపకం కోసం సొంత భూములు కలిగి ఉన్నవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. ఈనెల 25వతేదీన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో గొర్రెల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.

కులవృత్తులకు చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గొల్ల, కురుమలకు 75శాతం రాయితీపై గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. ఒక యూనిట్ విలువ రూ.1.25లక్షలు ఉంటుందన్నారు. ఇందులో 75శాతం ప్రభుత్వ వాటా, 25శాతం లబ్దిదారుడి వాటా ఉంటుందన్నారు. మొదటి విడతలో 3,34,619 మందికి పంపిణీ చేశామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమ‌ల‌లో ఉచిత బ‌స్సులను పెంచాలి : టిటిడి ఈవో