తెలంగాణాకు మరో 20 ఏళ్లు మా మామ కేసీఆరే సీఎం : మంత్రి హరీశ్‌రావు
తెలంగాణా రాష్ట్రానికి మరో 20 యేళ్లు మా మామ కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని తెరాస సీనియర్ నేత, ఆ రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు జోస్యం చెప్పారు. వరంగల్‌లో జరిగిన తెరాస బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ
తెలంగాణా రాష్ట్రానికి మరో 20 యేళ్లు మా మామ కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని తెరాస సీనియర్ నేత, ఆ రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు జోస్యం చెప్పారు. వరంగల్‌లో జరిగిన తెరాస బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.. దేశ చరిత్రను తిరగరాయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి ముఖ్యమంత్రి (వన్‌టెర్మ్ సీఎం) కాదు.. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి (ఫోర్ టెర్మ్స్ సీఎం) అవుతారన్నారు. మరో 20 ఏళ్ల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఇందుకోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు. తెరాస సర్కారు మూడేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ అడ్డుకుంటోందని విమర్శించారు. తెదేపాది ముగిసిన చరిత్రన్నారు.
భాజపాకు గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఐదు సీట్లు వచ్చాయని, 2019లో అవి కూడా దక్కవని జోస్యం చెప్పారు. 50 లక్షల తెరాస సభ్యత్వాలు నమోదు చేయించాలని పుస్తకాలు ముద్రించామని చెప్పారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో మళ్లీ ముద్రించామన్నారు. 27న బహిరంగ సభకు అంచనాలకు మించి జనం వస్తారన్నారు.