Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో పదేళ్ల పాటు కేసీఆరే సీఎం.. హరీష్‌ రావుతో విభేదాల్లేవ్: కేటీఆర్

మరో పదేళ్ల పాటు తెలంగాణ సీఎంగా కేసీఆరే ఉంటారని.. మరో మంత్రి హరీష్ రావు, తనకు మధ్య ఎలాంటి అంతరం లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో 64 ఏళ్లు పెద్ద వయసేం కాదని.. కేసీఆర్ ఇప్పుడే త

మరో పదేళ్ల పాటు కేసీఆరే సీఎం.. హరీష్‌ రావుతో విభేదాల్లేవ్: కేటీఆర్
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (10:12 IST)
మరో పదేళ్ల పాటు తెలంగాణ సీఎంగా కేసీఆరే ఉంటారని.. మరో మంత్రి  హరీష్ రావు, తనకు మధ్య ఎలాంటి అంతరం లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో 64 ఏళ్లు పెద్ద వయసేం కాదని.. కేసీఆర్ ఇప్పుడే తప్పుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేటీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడే తనకు సీఎం అవ్వాలన్న కోరిక తనకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రజలతో మమేకం తగ్గిందని.. అందుకే సభలు నిర్వహిస్తున్నామని.. త్వరలో సిద్ధిపేట సభలో పాల్గొంటానని తెలిపారు. 
 
తెలంగాణలోతమకు ప్రత్యామ్నాయమే లేదని.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దిక్కులేదని కేటీఆర్ విమర్శించారు. గుజరాత్‌లోనూ భాజపాకు గెలుస్తానన్న నమ్మకం లేకే నిన్న భారీ ర్యాలీ నిర్వహించిందంటూ ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికల కోసం భాజపా కూడా చూస్తోందని.. తెలంగాణలో పాగా వేసేందుకు కమలం శతవిధాలా ప్రయత్నిస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా పోటీకి రెడీ అని.. తెలంగాణలో తమకు తిరుగులేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాట వినకుంటే బర్తరఫ్... : కమలనాథుల కనుసన్నల్లో తమిళనాడు రాజకీయాలు..?!