Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#KCR : 'నిజాం మై కింగ్‌... మై హిస్టరీ' .. సీఎం కేసీఆర్

సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలకులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు విషం చిమ్మారు. కొందరు సమైక్య పాలకులు తెలంగాణను రజాకార్లకు నిలయంగా విషప్రచారం చేశారనీ, చరిత్రను వక్రీకరించారంటూ ఆరోపించారు.

Advertiesment
KCR
, శుక్రవారం, 10 నవంబరు 2017 (10:56 IST)
సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలకులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు విషం చిమ్మారు. కొందరు సమైక్య పాలకులు తెలంగాణను రజాకార్లకు నిలయంగా విషప్రచారం చేశారనీ, చరిత్రను వక్రీకరించారంటూ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం మైనార్టీ సంక్షేమ శాఖ పద్దులపై చర్చ జరిగింది. 
 
ఇందులో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, సమైక్య పాలనలో నిజాం చరిత్రపై అసత్య ప్రచారం జరిగిందన్నారు. కొందరు పాలకులు తెలంగాణను రజాకార్లకు నిలయంగా విషప్రచారం చేస్తూ, చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు. అందువల్ల నిజమైన తెలంగాణ చరిత్రను రాయిస్తానని చెప్పారు. 
 
అంతేకాకుండా, 'నిజాం మై కింగ్‌. మై హిస్టరీ. నిజాం మన రాజు. మన చరిత్ర. మన తెలంగాణ చరిత్రను వక్రీకరించి.. రకరకాల ప్రచారం చేశారు. కొంచెం చెడు ఉండొచ్చు. మంచిని, చెడును ఒకే గాటన కట్టొద్దన్నారు. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలంగాణకు తొలి సీఎంగా తనదేన'న్నారు. 
 
ఒక విషయం బాధ కలిగిస్తుంటుందని… నన్ను విమర్శించేటప్పుడు ‘నయా నిజాం కేసీఆర్‌’ అని విమర్శిస్తారని తెలిపారు. ఉద్యమ సమయంలో కొంతమంది ‘తెలంగాణ అంటే రజాకార్లు’ అన్నారన్నారు. ఎవరిదైనా సరే తప్పు ఉంటే తప్పు అనాలే. సమైక్య పాలకులు దుర్మార్గపు ప్రచారం పెట్టారు. దానికి ఇతరులు సహకరించారన్నారు.. తెలంగాణకు ఉజ్వలమైన, గొప్ప చరిత్ర ఉంది. అద్భుతమైన చరిత్ర ఉందని, ఆ నిజమైన గొప్ప చరిత్రను రాయిస్తానని గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమారుడికి 'మరణ శిక్ష'... ఓ తండ్రి తీర్పు : ఎందుకో తెలుసా?