Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నయీమ్ ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు

నయీమ్ ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు
, గురువారం, 28 నవంబరు 2019 (08:22 IST)
గ్యాంగ్ స్టర్ నయీమ్ కు 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని సిట్ వెల్లడించింది. తెలంగాణ, ఏపీలతో పాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వేయి 15 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలతో పాటు  మొత్తం 29 భవనాలు ఉన్నాయి. 1.90 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 2.8 కోట్ల నగదు, 258 సెల్ ఫోన్లు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలున్నాయని సిట్ వివరించింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్దనున్న మిలినియం టౌన్ షిప్‌లో తలదాచుకున్న నయీమ్  2016, ఆగస్ట్ 8వ తేదిన  పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు.

ఈ కేసును అప్పటి నుంచి విచారణ జరుపుతున్నది. తాజాగా కేసు ఐటీ శాఖకు చేరింది. నయీమ్ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. బినామీల పేరిట ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్లు గుర్తించారు.

ఈ కేసులో అరెస్టయి..బెయిల్‌పై బయటకు వచ్చిన నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్తులను ఎలా కూడబెట్టారు ? తదితర వివరాలను ప్రశ్నిస్తున్నారు. కానీ టైలరింగ్, బట్టల వ్యాపారం ద్వారా ఆస్తులు సంపాదించడం జరిగిందన్న వ్యాఖ్యలను ఐటీ అధికారులు నమ్మడం లేదని తెలుస్తోంది.

వేల కోట్ల రూపాయలు కూడబెట్టిన నయీమ్ ఐటీ చెల్లింపులు చేశారా ? లేదా ? అనేదానిని ఆరా తీస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోయలో పడ్డ బస్సు – 16 మంది దుర్మరణం