Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి: మంత్రి హరీశ్ రావు

Advertiesment
social distance
, ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (16:55 IST)
మార్కెట్‌లో అమ్మకం, కొనుగోళ్ల దారులు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సమీకృత మార్కెట్ లోని వెజ్, నాన్ వెజ్, చేపల మార్కెట్ ను ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో నివారణకు పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కూరగాయల మార్కెట్‌లో వినియోగదారులు ఎవరికీ వారే సామాజిక దూరం పాటించేలా పోలీసులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, మీరేమైనా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అంటూ మటన్ షాపు నిర్వాహకులను ఆరా తీశారు. 

మటన్ షాపుకు వచ్చే వినియోగదారులు తమవెంట స్టీల్ బాక్సు తెచ్చుకోవాలని, చేపల మార్కెట్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నదని, వెంటనే శుభ్రం చేయించాలని మార్కెట్ నిర్వాహకులను మంత్రి ఆదేశించారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీట్, నాన్ మీట్, చేపల మార్కెట్ మొత్తాన్ని డేటాల్ తో శుభ్రం చేయించాలని ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాంను ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెన్షన్లలో కోత : క్లారిటీ ఇచ్చిన కేంద్రం