Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిపై బీజేపీ క్లారిటీ!

muralidhar rao
, మంగళవారం, 7 నవంబరు 2023 (08:52 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర రావు ఓ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఈయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, టీబీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారని చెప్పారు. 
 
అలాగే, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేసులో లేరని స్పష్టంచేశారు. అందుకే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. అదేసమయంలో డిసెంబరు మూడో తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజోగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీలోకి వస్తారని తెలిపారు. 
 
తెలంగాణ ఎన్నికలు : కాంగ్రెస్ మూడో జాబితా.. కామారెడ్డిలో రేవంత్ 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం రాత్రి 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను వెల్లడించింది. ఇందులో టీపీసీ చీప్ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. 16 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఆ పార్టీ రిలీజ్ చేసింది. 
 
ఈ జాబితాలో నిజామాబాద్ పట్టణ సీటును మాజీ మంత్రి షబ్బీర్ అలీకీ కేటాయించింది. ఇక చెన్నూరు నుంచి జి.వివేక వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు తెలిపింది. రెండు సీట్లలో అభ్యర్థులను మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బోథ్ నియోజకవర్గంలో అశోక్ స్థానంలో ఆదె గజేందర్, వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘా రెడ్డికి సీట్లు కేటాయిస్తూ మార్పులు చేసింది. మరోవైపు, పొత్తులో భాగంగా, కొత్తగూడెం సీటును సీపీఐకు కేటాయించింది. తాజా జాబితాతో మొత్తం 114 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. 
 
కాంగ్రెస్ ప్రకటించిన మూడో జాబితాలోని అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే, 
మూడో విడత అభ్యర్థుల జాబితా ఇదే
 
1. చెన్నూరు - వివేక్ వెంకటస్వామి
2. కామారెడ్డి - రేవంత్ రెడ్డి
3. బాన్సువాడ - ఏనుగు రవీందర్
4. నిజామాబాద్ అర్బన్ - షబ్బీర్ అలీ
5. డోర్నకల్ - రామచంద్ర నాయక్
6. వైరా - రాందాస్
7. ఇల్లందు - కోరం కనకయ్య
8. సత్తుపల్లి - మట్టా రాగమయి
9. అశ్వారావుపేట - ఆదినారాయణ
10. వనపర్తి - మేఘారెడ్డి
11. బోథ్ - గజేందర్
12. జుక్కల్ లక్ష్మీ కాంతారావు
13. కరీంనగర్ - పరుమళ్ల శ్రీనివాస్
14. సిరిసిల్ల - మహేందర్ రెడ్డి
15. నారాయణ ఖేడ్ - సురేష్ షెట్కర్
16. పఠాన్ చెరు - నీలం మధు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ.. హాజరుకానున్న పవన్ కల్యాణ్