Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యే ప్రసక్తే లేదు: తెరాసపై రేవంత్ రెడ్డి ధ్వజం

Advertiesment
కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యే ప్రసక్తే లేదు: తెరాసపై రేవంత్ రెడ్డి ధ్వజం
, సోమవారం, 9 మే 2016 (19:00 IST)
రాష్ట్రానికి న్యాయం జరగాలనే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తానంటూ టీఆర్ఎస్‌ నేతలు వాళ్ల సొంత పత్రికలో ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల్లోకి మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిడిపి, వైసిపిలు మద్దతివ్వడాన్ని తెరాస తప్పుపట్టింది. దీనిపై రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఫైర్ అయ్యారు. 
 
2014 ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా పోటీ చేశారని తెరాస ప్రశ్నించడంపై  కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. శంకరమ్మ పైన పోటీ చేయలేదని కాంగ్రెస్ వెల్లడించింది. ఇంకా ఉత్తమ్ సిట్టింగ్ స్థానంలో తెరాసనే శంకరమ్మను బరిలోకి దింపారన్నారు. తుమ్మల నాగేశ్వర రావు వంటి తెలంగాణ ద్రోహులను ఎమ్మెల్సీగా చేసి, పదవులు కట్టబెట్టిన కేసీఆర్.. శంకరమ్మను ఎమ్మెల్సీగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
 
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్త నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. తెరాస అధికారంలోకి వస్తే కుర్చీ వేసుకొని ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తానని గతంలో చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగారు. కేసీఆర్ తన హామీని మరిచిపోయి ఇప్పుడు ఫాంహౌస్‌లో పడుకున్నారని దుయ్యబట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీని ముక్కలు ముక్కలుగా చేస్తాం: బెదిరింపు లేఖ