Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు అడ్డుపడిన వ్యక్తి.. నక్సలైటా?

Advertiesment
సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు అడ్డుపడిన వ్యక్తి.. నక్సలైటా?
, మంగళవారం, 2 జూన్ 2020 (21:18 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ కారుకు ఓ వ్యక్తి అడ్డుపడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. దీన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అమరవీరులకు గన్ పార్కులో నివాళులు అర్పించారు. 
 
ఆ తర్వాత సీఎం కేసీఆర్ గన్ పార్కు నుంచి ప్రగతి భవన్‌కు తిరిగి వెళుతుండగా, ఆయన కాన్వాయ్‌కు అడ్డుపడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. సీఎం కేసీఆర్ కారు ముందుకు అతను ఒక్కదుటున దూకాడు.
 
అయితే సీఎం భద్రతా సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఆ వ్యక్తిని సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషనుకు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
 
కాగా, ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని హనమంత్ నాయక్‌గా గుర్తించారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో తాత్కాలిక డ్రైవరుగా పని చేస్తున్నట్టు కనుగొన్నారు. హనుమంత్ నాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అలాగే, ఈ ఘటనపై విధుల్లో ఉన్న పోలీసులపై హైదరాబాద్ పోలీస్ కమిషనరు అంజనీ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. అలాగే, హనుమంత్ నాయక్ నేపథ్యంతో పాటు ఇతర వివరాలను సేకరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరీక్షా కేంద్రంలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే: మంత్రి ఆదిమూలపు