Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఏర్పడ్డాక దళితుల పై దాడులు పెరిగినై: మధుయాష్కీ

తెలంగాణ ఏర్పడ్డాక దళితుల పై దాడులు పెరిగినై: మధుయాష్కీ
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (09:20 IST)
తెలంగాణ ఏర్పడ్డాక దళితుల పై దాడులు పెరిగినై అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మా ఇంటి దైవమైన శ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
 
ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ - గ్రామ స్థాయిలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కలిసి పార్టీని బలోపేతం చేయమని రాహుల్ గాంధీ గారు అదేశించారన్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేదిస్తుంటే ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు వెనకడుగు వేయకుండా పోరాడుతున్న  కార్యకర్తలను అభినందించారు. 
 
అత్యంత అవినీతిపరమైన ముఖ్యమంత్రి ఈ కేసీఆర్, అభివృద్ధి  ఆలయ నిర్మాణపనుల పేరు మీద చిన్న చిన్న వ్యాపారుల షాపులు, గరిబోళ్ల ఇల్లు కూలగొట్టి వారికి ప్రత్యామ్నాయం కూడా ఏమి చూపించకుండా వారిని ఇబ్బంది పెడ్తున్నారు. ఇదే అంశం పై న్యాయనిపుణుల సలహాతో కమిటీ ఏర్పాటు చేసి హై కోర్టుకు వెళ్తామన్నారు. 
 
వనపర్తిలో దళిత సోదరి లావణ్య కాలేజి ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య పరిస్థి ఈ రోజు తెలంగాణలో ఉందన్నారు. అలాగే తెలంగాణ ఏర్పడ్డాక దళితుల పై దాడులు పెరిగినై, దళిత ఆఫీసర్లను అవమణిస్తూ వారికి ప్రమోషన్స్ ఇవ్వకుండా మానసికంగా హింసిస్తూ అగ్రకులాల వారికి పెద్ద పీట వేస్తూ కింది వర్గాల వారిని అవమాణిస్తున్నారని ఆరోపించారు
 
వాసాలమర్రికి వచ్చి అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలకు పంగాణమలు పెడ్తున్నాడు కేసీఆర్. వాసాలమర్రిలో  ఉన్న ఇళ్ళని కూలగొట్టి తన ఫార్మహౌస్ కి పొవడానికి రహదారి వేసుకొని అక్కడ చుట్టుపక్కల అక్రమంగా సంపాదించిన కల్వకుంట్ల కవిత భూముల ధరలు పెంచడానికి ఈ నాటకాన్ని తెరలేపరన్నారు. 
 
ఈ కచరా ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి ఇప్పటిదాకా దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కొత్త నాటకాలకు తెరలేపుతుండు. అంబెడ్కర్ విగ్రహం కట్టిస్తా అని బహుజనులను అవమానించిండు , మూడెకరాల భూమి ఇవ్వలేదు, ఏది నెరవేర్చకుండా మళ్ళీ దళిత బంధు అంటూ వస్తున్నాడు కావున ప్రజలు ఇది గమనించాలన్నారు. 
 
ఈ పిట్టలదొర చేస్తున్న మోసాల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది.  ఆగస్టు 9వ తేదీన దళిత గిరిజన దండోరా మొదలవుతుందని దళిత గిరిజనులను ఎలా తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారన్నది ఇంద్రవెళ్లి దళిత గిరిజన దండోరా ద్వారా ప్రజల్లోకి వస్తున్నామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటవీసంపదను కాపాడుకోవ‌డం కోస‌మే మొక్క‌ల పెంప‌కం: మంత్రి బాలినేని