Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో లాక్డౌన్ పొడగింపు : సడలింపు సమయం కూడా పెంపు?

Advertiesment
Lockdown
, శుక్రవారం, 28 మే 2021 (09:49 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్‌ను పొడగించాలన్న ఉద్దేశ్యంతో ఉంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చని భావిస్తోందని సమాచారం.
 
ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. 24 గంటల్లో కేవలం 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలను అనుమతినిస్తున్నారు. అనంతరం లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.
 
ఈ కారణంగా వైరస్ వ్యాప్తి చెందడం లేదు. అంతేగాకుండా, పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. ఇంకా తగ్గాలంటే.. లాక్‌డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలనే అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
 
మరో వారం రోజులు పొడిగిస్తే.. కరోనాను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చని భావిస్తోందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు, ఇతర పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష జరుపనున్నారు. లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.
 
వాస్తవానికి గతంలో లా‌క్‌డౌన్ అనే మాట వినిపిస్తేనే రాష్ట్రానికి పోయే ఆదాయం గురించి ప్రస్తావన వచ్చేదని.. అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం ప్రజల ఆరోగ్యం గురించి సీఎం కేసీఆర్ మాటల్లో వినిపిస్తోందని చెబుతున్నారు. అనారోగ్యాన్ని పెంచుకుంటూ పోయే కన్నా.. ఆర్థికంగా కొంత నష్టం జరిగినా.. ప్రజలు ఆరోగ్యంగా ఉండటం మంచిదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. 
 
ఈ కారణంతోనే.. మరో ఆలోచన లేకుండా లాక్‌డౌన్ పొడిగించారని.. తాజాగా మరోసారి పొడిగింపు ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 30నుంచి వచ్చే నెల 15 వరకు లేదంటే 10 వరకు అయితే పొడిగింపు నిర్ణయాన్ని 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. 
 
ఇప్పుడు అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ఫలితం రావటమే కాదు.. రాష్ట్రంలో కేసుల తీవ్రత తగ్గుతుందని.. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే వీలుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈసారి లాక్‌డౌన్ పొడిగింపు వేళలో.. ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే వీలుందని చెబుతున్నారు.
 
ప్రస్తుతం లాక్‌డౌన్‌ను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇవ్వటం, ఈ టైంలో అన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపారాల్ని నిర్వహించుకోవటానికి వీలు కల్పించటం తెలిసిందే. తాజాగా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల వరకు ఉన్న పొడిగింపును మధ్యాహ్నం 12 గంటల వరకు పెంచే వీలుందని తెలుస్తోంది. 
 
అలా చేయటం ద్వారా వ్యాపార వర్గాల వారికి మిగిలిన వారికి అంతో ఇంతో వెసులు బాటు ఉంటుందని చెబుతున్నారు. ఈ పొడిగింపుతో వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని రోజులు లాక్‌డౌన్ విధించాలా? లేదా? అన్న నిర్ణయం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు ఎన్టీఆర్ జయంతి : తెలుగు జాతికి నిరంతర స్ఫూర్తి