Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరంగల్‌లో చిరుతపులి సంచారం, చంపితే కేసు నమోదు చేస్తాం

Advertiesment
వరంగల్‌లో చిరుతపులి సంచారం, చంపితే కేసు నమోదు చేస్తాం
, సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:15 IST)
గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుతపులులు అక్కడక్కడా జనావాసంలోనికి వచ్చి ప్రజలను భయందోళనలకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న మంచిర్యాల, కొమురంభీం జిల్లాలతో పాటు హైదరాబాదు నగర ప్రజలను భయెందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.
 
ఇప్పుడు తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేటలో ఓ జంతువు ఆయా ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. సీతంపేట గ్రామ పంచాయతి నర్సరీ నిర్వాహకుడు, నర్సరీ పరిసరాల్లో ఆ జంతువును చూసారు. ముందుగా ఏదో జంతువుగా గుర్తించారు. ఆ జంతువు ఎంతకీ అక్కడ నుండి వెళ్లకపోవడంతో కర్ర తీసుకొని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయానికి ఆ జంతువు పులిలా శబ్ధం చేయడంతో కొంత వెనక్కి తగ్గారు.
 
దీంతో భయాందోళన చెందిన నర్సరీ నిర్వాహకుడు, స్థానికులు పారెస్టు అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎల్కత్తురి పారెస్ట్ రేంజర్ సందీప్, సెక్షన్ ఆఫీసర్లు హుస్సేన్, రమేష్, ముజీబ్ ఆ జంతువు తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత వీడియో క్లిప్పింగ్, పాదముద్రలను పరిశీలించారు. అనంతరం అక్కడి ప్రజలకు షాకింగ్ నిజాన్ని తెలిపారు. అది పెద్దపులి కాదని తెలిపారు. అది చిరుతపులి పిల్లగా అనుమానం వ్యక్తం చేశారు.
 
ప్రజలెవ్వరు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని, ఒకవేళ చిరుత పిల్ల పరిసర ప్రాంతాలలో ఉండవచ్చునని తెలిపారు. లేదంటే తిమ్మాపురం, గుంటూరుపల్లి వైపుగా వెళ్లే అవకాశముందని తెలిపారు. ఒకవేళ చిరుత పిల్లను చంపేందుకు వేటాడితే కేసులు నమోదు చేస్తామని పారెస్ట్ రేంజర్ సందీప్ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ సర్కారు..