తెలంగాణలో వరుసగా పులులు, చిరుతల సంచారం జనంకు కంటిమీదకునుకులేకుండా చేస్తున్నాయి. శనివారం ఎక్కడో ఒక్కచోట తారాసపడడం లేదా పశువులపై దాడులు చేస్తుండడంతో జనాలు వణికిపోతున్నారు. తాజాగా మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం గ్రామ శివారులో చిరుత పిల్లలు కలకలం రేపాయి.
శుక్రవారం రాత్రి కామారం గ్రామ సమీపంలో మామిడి తోట వద్ద మూడు చిరుత పులి పిల్లలు రోడ్డుపై బైఠాయించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అటుగా వచ్చిన ఆటో వెంబడి పరిగెత్తడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనట్టు చెప్తున్నారు. టెన్షన్‌లోనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పటించుకోడం లేదు అని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.
ఇక కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారంతో తీవ్ర భయాందోళనలో ఉన్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలో టపాకాయలు కాల్చి మంటలతో చిరుతలను తరిమి వేశామని గ్రామస్తులు అంటున్నారు. చిరుత పులుల బాద నుండి తమను కాపాడాలని కామారం గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.