Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష మంది అసదుద్దీన్ లు వచ్చినా ఏమీ చేయలేరు: కిషన్ రెడ్డి

Advertiesment
Asaduddins
, బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:51 IST)
ఒక్క అసదుద్దీన్ ఒవైసీ కాదు... లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు.

అమాయక ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి... రాజకీయ పార్టీలు, సంస్థలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీఏఏలో మైనార్టీలకు నష్టం చేకూర్చే అంశం ఒక్కటి కూడా లేదని స్పష్టం చేశారు.

దేశ ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు సీఏఏలో లేవని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ.. విపక్షాలు మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు.

రాజకీయంగా మోదీని, భాజపాను ఎదుర్కోలేక విపక్ష పార్టీలు మత విద్వేషాలు రెచ్చగోట్టడం మంచిది కాదని సూచించారు. సీఏఏలో మైనార్టీలకు నష్టం చేకూర్చే అంశం ఒక్కటి లేదని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని మైనార్టీ ప్రజలు నమ్మవద్దని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు సీఏఏలో లేవని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ.. విపక్షాలు మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు.

రాజకీయంగా మోదీని, బీజేపీను ఎదుర్కోలేక విపక్ష పార్టీలు మత విద్వేషాలు రెచ్చగోట్టడం మంచిది కాదని సూచించారు. సీఏఏలో మైనార్టీలకు నష్టం చేకూర్చే అంశం ఒక్కటి లేదని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని మైనార్టీ ప్రజలు నమ్మవద్దని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులతో అమెరికా అధ్యక్షుడు భారత్​లో పర్యటిస్తే.. సీఏఏ పేరుతో శాంతి, భద్రతల సమస్య సృష్టిండం మంచి పరిణామం కాదన్నారు.

కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయని.. ఎవరికీ నష్టం కలిగిందని సభలు నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ పార్టీ, ఏ సంస్థ హింసకు పాల్పడినా, విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సంఘ విద్రోహా శక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
గ్రామాభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం కావాలి
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని గుమ్మడివెల్లి గ్రామాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి దత్తత తీసుకున్నారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజనలో భాగంగా రానున్న నాలుగేళ్లలో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని గ్రామస్తులను కోరారు.

ప్రతి పార్లమెంట్ సభ్యుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ సూచించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజనలో భాగంగా కందుకూరు మండలం గుమ్మడివెల్లిని గ్రమాన్ని దత్తత తీసుకున్నారు.

గుమ్మడివెల్లిని సందర్శించి, గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీలకతీతంగా అంతా కలిసి అభివృద్ధి చేసుకుందామని గ్రామస్తులకు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీకి షాక్​- ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా 'బీహార్'​ తీర్మానం