Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోదండరామ్ కొత్త పార్టీ పెడతారా? యోగేంద్ర యాదవ్ కామెంట్స్‌కు అర్థం ఏమిటి..? కేసీఆర్‌కు కష్టాలు తప్పవా?

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం.. రాజకీయ పార్టీ పెట్టే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి నడిచిన కోదండరామ్‌.. ఆ

కోదండరామ్ కొత్త పార్టీ పెడతారా? యోగేంద్ర యాదవ్ కామెంట్స్‌కు అర్థం ఏమిటి..? కేసీఆర్‌కు కష్టాలు తప్పవా?
, గురువారం, 19 జనవరి 2017 (14:23 IST)
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం.. రాజకీయ పార్టీ పెట్టే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి నడిచిన కోదండరామ్‌.. ఆ తర్వాత తెలంగాణలో ఏర్పడిన ఆ పార్టీ ప్రభుత్వంతో మాత్రం కలిసి ముందుకు సాగట్లేదు.  ప్రజలు కోరుకున్న విధంగా ప్రభుత్వం నడవడం లేదని కోదండరాం ఆరోపిస్తున్నారు. అసలు ప్రజలు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం రాలేదనే చెప్తున్నారు. 
 
తాము సామాజిక తెలంగాణ కోసం కష్టిస్తే... అందుకు విరుద్ధమైన పాలన అందిస్తున్న కేసీఆర్ సర్కారు... ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు నడుస్తోందని గళం విప్పుతున్నారు. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పలు పథకాల పట్ల కూడా ఆయన అసంతృప్తిలోనే ఉన్నారని కోదండరామ్ తెలిపారు. ఈ పూర్వాశ్రమంలో ఆప్‌లో కీలక నేతగా ఉండి ప్రస్తుతం జైకిసాన్ ఆందోళన్ కన్వీనర్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ హైదరాబాదు వచ్చిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రత్యామ్నాయ రాజకీయం అన్న అంశంపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన ప్రత్యేక సదస్సుకు హాజరైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అందరికీ షాక్‌నిచ్చింది. సమీప భవిష్యత్తులోనే కోదండరాం రాజకీయ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అయినా యోగేంద్ర యాదవ్ సదస్సులో మాట్లాడితే.. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అస్తవ్యస్తంగా ఉందని దీనిని సరి చేసేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం ఉందన్నారు. 
 
టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో రాజకీయ పార్టీ రావాలని ఇది ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి - అసమర్థ ప్రభుత్వా లను ఎదుర్కొని ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఉండే వేదిక ఏర్పడాలని యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని బట్టి కోదండరామ్ కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టు కోర్టు పరిధిలో ఉంది.. మీకు మద్దతిస్తాం.. కానీ ఆర్డినెన్స్ ఎలా సాధ్యం : మోడీ ట్వీట్