Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో పాగా వేసేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్... ఏంటది?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచ తెలుగు మహా సభలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 2 నుండి 10 వరకు జరిగే ఈ సభలను ఘనంగా జరుపుతామని వెల్లడించారు. నూతనంగా ఏర్పాటయిన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ఇ

ఏపీలో పాగా వేసేందుకు కేసీఆర్ పక్కా ప్లాన్... ఏంటది?
, బుధవారం, 3 మే 2017 (12:06 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచ తెలుగు మహా సభలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 2 నుండి 10 వరకు జరిగే ఈ సభలను ఘనంగా జరుపుతామని వెల్లడించారు. నూతనంగా ఏర్పాటయిన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ఇందుకోసం దేశవిదేశాల్లోని సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులు, అవధానులను, కవులను ఆహ్వానిస్తామన్నారు.
 
ఇక్కడి వరకు అంతా బాగున్నప్పటికీ కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా తమ పార్టీని ఉనికిలో నిలపడానికి ఈ సభలను మొదటి అడుగుగా భావిస్తున్నారని సమాచారం. గతంలో తెలంగాణ సాధన సమయంలో ఆయన ఆంధ్రుల గురించి చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కెసిఆర్‌ను వ్యతిరేకిస్తున్నందున, పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
 
తెలుగు మహా సభల ద్వారా ప్రపంచంలోని తెలుగు ప్రజలందరినీ ఆహ్వానించి, తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే భావాన్ని ప్రజల్లో కల్పించడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతును సంపాదించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ విధంగా ముందుగా ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావనను తొలగించి, ఆపై భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి యాపిల్.. తిరుపతికి తెచ్చేందుకు అమెరికా వెళ్లనున్న చంద్రబాబు