కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15 నెలల బాలుడు అయస్కాంతాన్ని మింగేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యానగర్ కాలనీకి చెందిన జీవన్, కవిత దంపతుల కుమారుడు 15 నెలల కేతు రోజూ మాదిరిగా శుక్రవారం ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న అయస్కాంతాన్ని నోటిలో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతులోకి వెళ్లిపోయింది.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించిన వైద్యులు.. అధునాతన పద్ధతుల ద్వారా శస్త్ర చికిత్స చేసి అయస్కాంతాన్ని తొలగించారు. బాలుడు క్షేమంగా బయటపడటంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.