Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్, ప్రభుత్వ వాహనంలోనే అత్యాచారం: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడి

CP CV Anand
, బుధవారం, 8 జూన్ 2022 (09:44 IST)
దేశంలో సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కేసుకి సంబంధించిన వివరాలను మీడియాతో వెల్లడించారు. ఈ కేసులో ఒక నిందితుడు మేజర్ కాగా మిగిలిన ఐదుగురు మైనర్లుగా వున్నారని చెప్పారు.

 
బెంగళూరులో చదువుకుంటున్న ఓ విద్యార్థి హైదరాబాదులోని పబ్‌లో పార్టీ చేసుకోవాలని భావించాడు. దాంతో అతడు మరో ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. హైదరాబాదులో ఏ పబ్ అయితే బాగుంటుందో అడిగి చెప్పమన్నారు. వారంతా అమ్నేసియా పబ్ అయితే బాగుంటుందని చెప్పడంతో ఒక్కొక్కరికి రూ. 1200 చొప్పున వసూలు చేసారు.


తన స్నేహితురాలి ద్వారా బాధితురాలు టిక్కెట్ కొనుగోలు చేసింది. అలా మొత్తం అందరి దగ్గర వసూలు చేసిన తర్వాత మే నెల 28న పార్టీ అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టాడు. బెంగళూరు నుంచి 25వ తేదీన ఆ మైనర్ బాలుడు హైదరాబాద్ వచ్చాడు. అతడు రాగానే పబ్ సెంటరుకి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు.

 
మే 28న మధ్యాహ్నం 1.10 నిమిషాలకు మైనర్ బాలిక తన స్నేహితుడితో కలిసి పబ్‌కి వచ్చింది. అతడు మధ్యాహ్నం 1.50కి పని వుందని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనితో బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి సాయంత్రం 3.15 వరకూ అక్కడే వుంది. ఇంతలో నిందితుల్లో ఒకరు ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాత నిందితుడు సాదుద్దీన్ బాలికతో మాటలు కలిపాడు. ఇద్దరూ కలిసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

 
సాయంత్రం 5 దాటాక వారిద్దరూ ఆమె పట్ల మరింత అసభ్యంగా ప్రవర్తించారు. దీనితో ఐదున్నర ప్రాంతంలో పరిస్థితిని గమనించి బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి బయటకు వచ్చేసింది. నిందితులిద్దరూ బాధితురాలిని వెంబడించారు. ఇంతలో బాధితురాలి స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయింది. నిందితులు బాధితురాలిని ట్రాప్ చేసి బెంజి కారులో ఎక్కించుకున్నారు. ఆ కారులోనే ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేసాడు సాదుద్దీన్. ఆ సమయంలో వీడియోలు తీసింది కూడా వాళ్లే. వాటిని సర్క్యులేట్ చేసిందీ వారే. 

 
సాయంత్రం 5.54 ప్రాంతంలో బెంజ్ కారు దిగి బాలిక ఇన్నోవాలో ఎక్కింది. ఆ కారులో ఏ1 నిందితుడు సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లు, బాలిక వున్నారు. రోడ్ నెం.44 వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఇన్నోవాను ఆపేసారు. అక్కడే ఓ మైనర్ బాలికను రేప్ చేసాడు.


ఆ తర్వాత కారును తిప్పుతూ మిగిలినవారు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ లైంగిక దాడిలో బాలిక మెడ, శరీరంపై గాయాలయ్యాయి. ఆ తర్వాత అందరూ ఆమెను పబ్ వద్ద దించేసి వెళ్లిపోయారు. రాత్రి 7.50కి బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి ఆమెను తీసుకునివెళ్లారు. ఐతే 28న అత్యాచారం జరిగినప్పటికీ ఆమె తన తల్లిదండ్రుకు కానీ, పోలీసులకు కానీ విషయం చెప్పలేదు.

 
భరోసా కేంద్రంలో బాధితురాలికి ధైర్యం చెప్పిన తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే కేసు నమోదు చేసి జూన్ 3న ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను అరెస్టు చేయడం జరిగింది. ఇతడితో పాటు మరో నలుగురు మైనర్లు అత్యాచారం చేసారు. ఐదో మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడలేదు కానీ అసభ్యంగా ప్రవర్తించాడు.


కనుక అతడి పైనా కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. కాగా నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం వారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ దండన పడవచ్చని తెలిపారు. కారులో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఐదో మైనర్ బాలుడికి 5 నుంచి ఏడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశముందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో భానుడి భగభగ.. 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత